ఊసరవెల్లి వై.యస్. రాజశేఖర్ రెడ్డి

నయవంచకుడు, రెండు నాల్కల మనిషి, జిత్తులమారి నక్క, నమ్మక ద్రోహి, ఏరుదాటి తెప్ప తగలేసే రకం, అవకాశవాది, ఏ ఎండకా గొడుగు పట్టే రకం, నీతి నియమాలు లేని వ్యక్తి, కుటిల నీతి మంతుడు, సోనియా చెంచా... నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్దం అయే ఉంటుంది. అవును వై.యస్. రాజశేఖర్ రెడ్డి గురించే. తెలంగాణా ఇస్తా అనిచెప్పి ఎన్నికల్లో నెగ్గి, తాత్సారం చేస్తూ ఐదు సంవత్సరాలు ఒక సైకో నవ్వు మొఖానికి తగిలించుకొని ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని ప్రజల్ని మోసంచేసాడు. మొన్నటివరకూ తెలంగాణా ఇస్తాం మరో ఐదు సంవత్సరాలు మీ నెత్తినెక్కి ఊరేగే చాన్సు ఇవ్వండని తెలంగాణా ప్రజలను ముష్టి ఎత్తుకుని, మొదటి దశ ఎన్నికలు అయిపోగానే (ఇక తెలంగాణా లో గెలవననుకున్నాడో ఏమో) రాయలసీమ మీటింగులో రాయల సీమ ప్రజలతో తెలంగాణా ఇస్తే తెలంగాణా లో ప్రైవేటు కాలేజీలు కట్టనివ్వరని, వ్యాపారం చేయనివ్వరని (ఏం వ్యాపారం రాజకీయ వ్యాపారమా), ప్రాజెక్టులకు నీళ్ళు రానివ్వరని చాలా విపులంగా వివరించి చెప్తున్నారు. తెలంగాణాలో మిగతా ప్రాంతాలవారు విదేశీయుల్లా బ్రతకాల్సి వస్తుందని రాయలసీమ ప్రజల చెవులో పూలు పెట్టి వారి మనసుల్ని విషపూరితం చేసి, వారికి లేనిపోని అపోహల్ని స్రుష్టిస్తున్నాడు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి కి తెలియదేమో.... తెలంగాణా ప్రజలు కోరేది ప్రత్యేక దేశం కాదని, ప్రత్యేక రాష్ట్రం మాత్రమే అని. స్వాతంత్ర్యం తరువాత ఎన్నో క్రొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాయి. తెలంగాణానే మొదటి రాష్ర్టం కాదు.

చంద్రబాబు నాయుడు గార్ని అసెంబ్లీ లోనే నీ అమ్మకడుపులో ఎందుకు పుట్టాను అని నువ్వు బాధపడేలా చేస్తానని అసెంబ్లీ మర్యాదని మరచి ఫ్యాక్షనిస్టు బుద్దిచూపించాడు.
శ్రీధర్ కార్టూన్లపై కూడా అసెంబ్లీలో ప్రస్తావించాడు. శ్రీధర్ ఎన్టీఆర్ మీద కూడా కార్టూన్లు వేసారు ఆయనెప్పుడూ ఇలా పగపట్టలేదు శ్రీధర్ పై.

వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు పక్కా అవకాశవాద రాజకీయుని మాటలు. అవి ఒక రాష్ట్ర ముఖ్యం మంత్రి మాట్లాడాల్ససిన మాటలు కావు. ఆయన కేవలం రాయలసీమకే ముఖ్యమంత్రి కాడు. మెత్తం ఆంద్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఆసంగతి మరిచారనుకుంటా... అయినా ఈయన కాలంలో తెలంగాణాలో రాయలసీమ ఫ్యాక్షన్ మనుషులతో ఎన్ని కబ్జాలు చేయించారో హైదరాబాదు వాళ్ళందరికీ తెలుసు.గవర్నమెంటు ఉద్యోగాలు అమ్ముకోవడం, కబ్జాలు, హత్యలు. మంచి ముఖ్యమంత్రే దొరికాడు మనకు. ఇప్పడికైనా అసలు రంగు బయట పెట్టుకున్నాడు ఊసరవెల్లి.

http://www.telugudesam.org/tdpcms/scams/bhoomulu/sakshiscam.php
http://ihateysr.blogspot.com

6 comments:

  1. మీ ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం సహజమైనవే.
    నూరేళ్ళ చరిత్ర వున్న కాంగ్రెస్స్ పార్టీ ప్రాంతీయ ఫాక్షనిస్టుల చేతుల్లో ఒక పాలసీ అనేది లేకుండా, ఒక సిద్ధాంతం, నీతీ నిజాయితీ లేకుండా ఈ స్థాయికి దిగజారడం విషాదం.
    ఓ మహాత్మా ఓ మహర్షీ చూడవయ్యా నీ కాంగ్రెస్ దుస్థితిని
    ఇప్పుడు గనక నువ్వు వుంటే గాడ్సే కాదు నిన్ను నువ్వే కాల్చుకుని ప్రాణత్యాగం చేసి వుండే వాడివి

    ReplyDelete
  2. @ప్రతాప్: అప్పుడున్నది ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ఇప్పుడున్నది ‘ఇందిరా కాంగ్రెస్’ఈ రెండూ వేరని గమనించగలరు.

    ReplyDelete
  3. I completely accept ur opinions.

    ReplyDelete
  4. yes. The congress which fought for freedom is different from present one. Infact Gandhi asked to wind up the Congress after freedom just to preserve its respect and prevent if from mis use by the later politicians.

    ReplyDelete
  5. అధికారంకోసం అయిన వాల్లందరని వెన్నుపోటు పొడిచే వారికన్నా,

    సిద్దాంతాలకి నీళ్ళు వదిలివేసే వారికన్నా, సభ్యత మరచి ఎంతటి పదాలనైన ప్రయోగించే వాళ్ళకన్నా,

    అస్సలు న్యాయంతో గాని చట్టంతోగాని తమకు
    సంభందం లేదు ఆ సమయానుకూలంగా తమకు వక్తిగత హాని జరగకుండే ఉంటే చాలు,దేశమేమైనా పోనీ అనుకునే భజన పరులతో నిండిన రాజకీయ పార్టిల కన్నా,

    దేశ భద్రత గురించి ఎదుటి వాల్లకి చప్పడమే కాని తమ దాకా వస్తే అదేమంత ప్రాధాన్యతతో కూడిన విషయం

    కానట్ట్లు దేశ ద్రోహులను విడచి పెట్టే రాజకీయ ధురంధరులకన్నా,

    """""అనంత కోటి రెట్లు ఎక్కువ రాజశేఖరుని రాజనీతి""""" ...

    కుటిలత్వమే చేతనైన వాళ్ళకి సామాన్య పద ప్రయోగంతో కట్టడి చేయటం అస్సాధ్యం, వాల్లకి తోడు ఎదుటివారు దోచేస్తున్నారు మేమూ అలాగే బ్రతికేయనుకున్న వాల్ల సాంగత్యంతో కూడితే అటువంటి వ్యక్తులకు

    సామాన్య సరళమైన విదంగా చెపితే ఏం వింటాడు...

    తెలంగాణా విషయమై మాకు ప్రత్యేకమైన దృక్పదం ఉంది అన్నాడె గాని ................

    ఇవ్వనూ,ఇస్తాను అని చెప్పలే...
    తెలంగాణాని విడదీస్తే వచ్చే ప్రధాన సమస్య వ్యవసాయ/త్రాగు.....నీటి

    సమస్య...ఇప్పటికే మహారష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నయ వంచన వలన మన రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నదని వార్తల్లో మన గమనిస్తు ఉన్నాం.

    గత ప్రభుత్వం కర్ణాటక వారితో వేసిన నాటకాలు ప్రజలకి తెలిసిందే,

    ప్రతి పక్షం లో ఉన్నాం పని పాటు ఎలాను లేవు,ప్రభ్త్వం మాకు ఇచ్చేది ఎలగైన ఇస్తుంది,..ప్రతి పక్షంలో ఉన్నా మేము ప్రజా సమస్యల గురించి అధికార పక్షాన్ని నిలదీసేము అని చెప్పుకోవడానికో,ప్రతి పక్షములో ఉండగా
    అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టి వాల్ల పరిపాలన సజావుగ జరుగ కుండా చేసి కాలయాపన చేయించి పరిపాలనా సమయం ముగుస్తున్న సరికి అధికార పక్షం ఏ విధమైన ప్రజా రంజిత కార్యక్రమాలు చేయలేదు,అనవసరంగ ఇది చేస్తాం,అది చేస్తాం అని మొదలు పెట్టి ప్రభుత్వ సొమ్ము వృధా చేసింది కాబట్టి మేము వేరే పదకాలు చేస్తాము మమ్మలని

    గెలిపించండీ .... సొల్లు ...

    తెలంగాణా సమస్య ఏ ఒక్క రాజకీయ వర్గ సమస్య కాదు అది రాష్ట్ర

    సౌభాగ్యానికి ముడి పెట్టి ఉన్న విషయం,,,అందరదీ....
    రాష్ట్రానికి కావలసింది రాష్ట్ర స్తితిగతులు తెలిసిన నాయకుడు......ఇక ఏ

    ఇతర పార్టిల నుండి ఎవ్వరూ కూడా రాష్ట్ర ఉన్నతికి దోహదం చేసే నాయకులు కాన రావడం లేదు...

    భూములు ఉద్యోగాలు అమ్ముకున్నది ఎవ్వరో ఒకసారి బుర్రకి కాస్త పని చెపితే.....

    నీతి నిజాయితీ ...హ హహ్ హ....
    మొదటినుండి రాష్ట్రాన్ని విడదీయటం ఇష్టంలేదు అని చెపుతూ ఇప్పుడు? అధికారవ్యామోహంతో... ....

    మందతో కలిసేము కాని ప్రత్యేక రాష్ట్రానికి మేమూ వ్య్తిరేకమన్న

    C.P.M..,నాయకులు, అస్సలు ప్రత్యేక మెందుకో ఇదమిద్దంగ తేల్చుకోలేని

    తెలంగాణా రాజకీయ వాదులు,
    ఏదో ఒక ఉద్యమమొస్తే చాలు ఎంతొకొంత దోచేద్దమనుకునే ..... ...........


    మహాత్ముని తలచుకుని మాకు చెవిలో పూలు పెట్టుద్దు, అళ్ళుడితో

    వెన్నుపోటుతిన్న మామ మీద జాలి చూపెట్టి వాడి ఆత్మ శ్శాంతి కోసం

    ప్రార్ధన చెయ్యి...

    ReplyDelete
  6. vsrsr gaaru
    vsrsr gaaroo...
    I wil give reply with all data.
    Pls wait.

    ReplyDelete