పాత నాణాలు













పాత నాణాలు
మరిన్ని నాణాలు చూడాలంటే....http://old-currency.blogspot.com/



OLD COINS,

స్వైన్ ఫ్లూ గూర్చి కొంత సమాచారం


స్వైన్ ఫ్లూ ని H1N1 flu, swine flu, hog flu, and pig flu అని కూడా పిలుస్తారు. Swine influenza virus (SIV) పందులనుండి మనుషులకు వచ్చే స్వైన్ ఫ్లూని జూనోటిక్ స్వైన్ ఫ్లూ (zoonotic swine flu) అంటారు. పందులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్నవారికి రావడానికి అవకాశం ఉంది. స్వైన్ ఫ్లూ లక్షణాలు-జ్వరం, గొంతు పొడిబారడం,దగ్గు, మంట, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం, అసహనంగా ఉండటం. పందులనుండి మనుషులకు వచ్చిన అనంతరం స్వైన్ ఫ్లూ అన్ని సార్లూ ప్రమాదకరంగా సంభవించదు. స్వైన్ ఫ్లూ వచ్చిన మాంసాన్ని సరిగ్గా ఉడకబెట్టినప్పుడు రిస్క్ తగ్గే అవకాశం ఉంది. Swine influenzaఉన్నవారు దగ్గేటప్పుడు కర్చీఫ్ లాంటిదేదైనా ముఖానికి ఉడ్డుగా పెట్టుకోవాలి. అలాంటి గుడ్డల్ని వాడిన అనంతరం కాల్చేయడం ఉత్తమం. ఆల్కహాల్ తో తయారైన క్లీనర్స్ తో చేతులు కడుక్కోవడం. రోగికి ఆరు మీటర్ల దూరంలో ఉన్నా స్వైన్ ఫ్లూ సోకే అవకాశం ఉంది. ఇంతవరకూ స్వైన్ ఫ్లూ తో చనిపోయిన వారిలో మరేదైనా తీవ్రమైన జబ్బు ఇంతకు ముందే ఉండి దానికి స్వైన్ ఫ్లూ తోడై చనిపోయిన వారే అధికంగా ఉన్నారు. స్వైన్ ఫ్లూ వచ్చిన వారు యాంటీ వైరల్ మందులు, జ్వరాన్ని, ఒళ్లు నొప్పుల్ని అరికట్టే మందుల్ని వాడి, శరీరంలో లవణాల నిష్పత్తిని బ్యాలెన్స్ చేస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఈమధ్య జరిగిన పరిశోధన ప్రకారం తెలిసిందేంటంటే వృధ్దులకు స్వైన్ ఫ్లూ ని తట్టుకొనే శక్తి అధికంగా ఉంటుందట. అమెరికాలో స్వైన్ ఫ్లూ వచ్చిన 46,752 మందిలో 477 మంది మరణించారు. కాబట్టి అతిగా భయపడకుండా వెంటనే చర్య తీసుకుంటే స్వైన్ ఫ్లూ నుండి బయటపడవచ్చు.



ఆంద్ర మహిళా సభ-స్వైన్ ఫ్లూ వేడుక (swine flu)

స్వైన్ ఫ్లూ అందరినీ భయభ్రాంతులను చేస్తుంది. ఈ సమయంలో అందరికీ ఎంతో కొంత ధైర్యాన్ని తోడ్పాటును ఇవ్వాల్సిన స్దానంలో ఉన్న కొందరు స్వైన్ ఫ్లూ భయాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. 2 రూపాయలకు దొరికే స్వైన్ ఫ్లూ మాస్కులను హైదరాబాద్ లోని విధ్యానగర్ "ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రి" లోని మెడికల్ షాప్ లో పనిచేసే మహిళలు (14-08-2009 time 4.15 pm )అనధికారికంగా 20 రూపాయలకు అమ్ముతున్నారు.

ఆంద్ర మహిళా సభ-స్వైన్ ఫ్లూ వేడుక (swine flu)

andhra mahila sabha hospital