ప్రాణం తీసిన కలుషిత నీరు
దాదాపు 20 సంవత్సరాల క్రితం నల్లగొండ జిల్లాలో ఇంటింటింకి నల్లాల ద్వారా మంచినీరు వచ్చేది కాదు. అప్పుడు ఎక్కడో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లా దగ్గరికి వెళ్ళి న నీళ్ళు తెచ్చు కునేవాళ్ళం. అక్కడ నీళ్ళ దగ్గర పెద్ద క్యూ ఉండేది. దారిన వెళ్తున్న కుష్టు వ్యాది ఉన్న వ్యక్తి వర్షానికి రోడ్డు పై నిలిచి ఉన్న బురద నీటిని తన డబ్బాలో పట్టుకుని తాగాడు. ఆ సంఘటన నన్ను చాలా బాధించింది. ఇప్పటికీ అదే సంఘటన నాకు అప్పుడప్పుడా గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది. ఇరవై ఏళ్ళలో నిజానికి చాలా అభివృద్ది చెందాలి. కానీ ఇప్పుడు కుష్టు వ్యాది ఉన్న వ్యక్తి మాత్రమే కాదు మనమందరం అతనితోపాటే మురికి నీరు తాగుతున్నాం. దానికి సాక్ష్యం రాష్ట్ర రాజధానిలోని భోలక్ పూర్ లో కలుషితనీటిని తాగి ఏడుగురు చనిపోవడం, కొన్ని వందలమంది ఆస్పత్రిపాలవడం.
స్వార్ద రాజకీయనాయకులు, నిద్రపోతున్న అధికారుల చలవ వల్ల ముందుముందు ఇంకా ఎక్కువ మంది ప్రజలకి మురికి నీరు అందుబాటులోకి రానుంది.
కొసమెరుపు ఏంటంటే పుల్లెల గోపీచంద్ గారు ప్రజలందరికీ మంచినీరు అందుబాటులోకి రావాలని ఒకరు మంచి నీటిని కొని తాగడం , తాహతు లేని వాళ్ళు మురికి నీరే తాగాల్సి రావడం వంటి పరిస్దితి మారాలని బిస్లరీ లాంటి కంపెనీల నుండి వచ్చిన మంచి నీళ్ళు కొనుక్కుని తాగమనే అడ్వర్టైజ్ మెంట్ ని కోట్ల రూపాయలు ఆశ చూపినా తిరస్కరించారని ఒక సెమినార్ లో విన్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment