chanakya`s quotes

Indian ancient Polititian Chanakya's Quotes - Worth reading
************ ********* ********* ********* ********* ***
"A person should not be too honest.
Straight trees are cut first

and Honest people are victimised first."



************ ********* ********* ********* ********* ***
"Even if a snake is not poisonous,
it should pretend to be venomous."


************ ********* ********* ********* ********* ***

"The biggest guru-mantra is: Never share your secrets with anybody. ! It will destroy you."



************ ********* ********* ********* ********* ***

"There is some self-interest behind every friendship.
There is no Friendship without self-interests.
This is a bitter truth."



************ ********* ********* ********* ********* ***

"Before you start some work, always ask yourself three questions - Why am I doing it, What the results might be and Will I be successful. Only when you think deeply
and find satisfactory answers to these questions, go ahead."



************ ********* ********* ********* ********* ***

"As soon as the fear approaches near, attack and destroy it.."



************ ********* ********* ********* ********* ***

"Once you start a working on something,

don't be afraid of failure and
don't abandon it.

People who work sincerely are the happiest."



************ ********* ********* ********* ********* ***

"The fragrance of flowers spreads

only in the direction of the wind.
But the goodness of a person spreads in all direction."


************ ********* ********* ********* ********* ***

"A man is great by deeds, not by birth."



************ ********* ********* ********* ********* ***

"Treat your kid like a darling for the first five years.

For the next five years, scold them.
By the time they turn sixteen, treat them like a friend.

Your grown up children are your best friends."


************ ********* ********* ********* ********* ***

"Books are as useful to a stupid person

as a mirror is useful to a blind person."



************ ********* ********* ********* ********* ***

"Education is the best friend.

An educated person is respected everywhere.
Education beats the beauty and the youth."

Chanakya quotes (Indian politician, strategist and writer, 350 BC-275BC)

గూగుల్ యాడ్ సెన్స్ చెక్




మీకూ బ్లాగులు, ఇలాంటి చెక్కుల గురించి సమాచారం కావాలంటే http://www.kingmanul.blogspot.com/ లేదా http://www.kingmanual-t.blogspot.com/ కు వెళ్ళండి.

GOOGLE ADSENSE CHEQUE

ధటీజ్ చిరు


ధటీజ్ చిరు
నిజమైన గాంధీగిరి చిరు ప్రవర్తనలో అడుగడుగునా కనిపిస్తుంది. ప్రచారంలో ఒక వ్యక్తి గుడ్డు విసిరినప్పుడూ చిరంజీవి తీవ్రంగా పరిగణించలేదు. మొఖంలో అదే చిరు నవ్వు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్షలను ఎంకరేజ్ చేయనని తను ఎప్పుడూ వ్యక్తిగత విమర్షలకు పాల్పడలేదు. చివరికి రాజశేఖర్ జీవితలు ఎంత కవ్వించినా ఇప్పడికీ అదే చిరునవ్వు.

ఎన్నికల్లో తాననుకున్న ఫలితం తారుమారైనా అప్పుడూ అదే చిరునవ్వు. స్ధిత ప్రజ్ఞత అంటే ఇదే కదా. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చిరు ఆదర్శప్రాయుడే. లగే రహో చిరు భాయ్.

That`s chiru

బ్రెయిన్ దొబ్బింది

*కలరా ప్రాణాంతకం కాదు....
-గల్లా అరుణ కుమారి (భోలక్ పూర్ లో కలుషిత నీటివల్ల కలరా వ్యాపించి 13 మంది మరణించిన సంబర్బంగా మంత్రి గారి కారు కూత)

*రైతులు తమ వ్యక్తిగత కారణాల వల్ల తమ పంటల్ని తగలబెట్టుకుంటున్నారు.
-షబ్బీర్ అలీ (కరెంటు, నీటి సరఫరా లేక ఎండిన పంటల్ని రైతులు తగులబెట్టూకున్న సందర్బంగా మంత్రిగారి మాటలు.)

కసబ్ లాయర్లు


కసబ్ తరపున మొదట వాదించిన లాయర్ అంజలీ వాగ్మరే. ఈవిడ గారు కసబ్ అతని అనుచరులు ముంబైలో దాడులు నిర్వహించనప్పుడు గాయపడిన ఒక వ్యక్తి తరపున ఆల్రెడీ లాయర్ గా వాదిస్తున్నారు.మరో పక్క ఈ మహా తల్లి కసబ్ తరపునా వాదిస్తారట. న్యాయస్దానం అంటే దీనికి ఆటలా ఉంది. భారతీయులు అంటే దీనికి ఓ మాదిరిగా కూడా కనపడట్లేరు. వాది తరపున ఈమే ప్రతి వాది తరపున ఈమే అట. ఈవిడ గారి తెలివిని భరించలేక కోర్టు మరో లాయర్ ని నియమించింది.



అబ్బాస్ కజ్మీ కసబ్ మరో లాయర్. ఏకపక్షంగా విచారణ జరపకుండా కసబ్ తరపునా ఒక లాయర్ ని నియమించాలని కొర్టు అనుకుంటే వీడు ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మిని చేసి ఏకంగా కసబ్ ని బయటికి తేవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే కసబ్ మైనరనే వాదన మొదలు పెట్టాడు. ఇదేనా భారత దేశానికి, ముంబై దాడుల్లో చనిపోయిన వారికి మనం ఇచ్చే విలువ. భారత దేశంలో ఒక పాకిస్తానీ తీవ్రవాదికి సపోర్టుగా వాదించే లాయరు అబ్బాస్ కజ్మీ. ముందు అబ్బాస్ కజ్మీ లాంటి వాళ్ళను ఉరి తీయాలి.

Abbas Kazmi
Mohammed Ajmal Amir Kasab
Anjali Waghmare
kasab`s lawyers

ఇస్లాం జింఖానా ట్రస్టీ పదవి నుండి కసబ్ లాయర్ తొలగింపు


ఎవరన్నారు ముస్లిం లంతా తీవ్రవాదులకు, పాకిస్తానీలకు వంత పాడతారని ఈ సంఘటన చూడండి.
కసబ్ లాయర్ అబ్బాస్ కజ్మీని ఇస్లాం జింఖానా ట్రస్టీ పదవి నుండి తొలగించారట మన ముస్లిం సోదరుడు.ఒక తీవ్రవాది తరపున వకాల్తా పుచ్చుకోవడం ఇస్లాం షరియా ప్రకారం తప్పని అబ్బాస్ కజ్మీ కసబ్ తరపున వాదిస్తున్నాడు కాబట్టి అతన్ని ఇస్లాం జింఖానా ట్రస్టీ పదవినుండి తొలగిస్తున్నామని వారి వివరణ. హాట్సాఫ్.

ప్రాణం తీసిన కలుషిత నీరు


దాదాపు 20 సంవత్సరాల క్రితం నల్లగొండ జిల్లాలో ఇంటింటింకి నల్లాల ద్వారా మంచినీరు వచ్చేది కాదు. అప్పుడు ఎక్కడో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లా దగ్గరికి వెళ్ళి న నీళ్ళు తెచ్చు కునేవాళ్ళం. అక్కడ నీళ్ళ దగ్గర పెద్ద క్యూ ఉండేది. దారిన వెళ్తున్న కుష్టు వ్యాది ఉన్న వ్యక్తి వర్షానికి రోడ్డు పై నిలిచి ఉన్న బురద నీటిని తన డబ్బాలో పట్టుకుని తాగాడు. ఆ సంఘటన నన్ను చాలా బాధించింది. ఇప్పటికీ అదే సంఘటన నాకు అప్పుడప్పుడా గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది. ఇరవై ఏళ్ళలో నిజానికి చాలా అభివృద్ది చెందాలి. కానీ ఇప్పుడు కుష్టు వ్యాది ఉన్న వ్యక్తి మాత్రమే కాదు మనమందరం అతనితోపాటే మురికి నీరు తాగుతున్నాం. దానికి సాక్ష్యం రాష్ట్ర రాజధానిలోని భోలక్ పూర్ లో కలుషితనీటిని తాగి ఏడుగురు చనిపోవడం, కొన్ని వందలమంది ఆస్పత్రిపాలవడం.
స్వార్ద రాజకీయనాయకులు, నిద్రపోతున్న అధికారుల చలవ వల్ల ముందుముందు ఇంకా ఎక్కువ మంది ప్రజలకి మురికి నీరు అందుబాటులోకి రానుంది.




కొసమెరుపు ఏంటంటే పుల్లెల గోపీచంద్ గారు ప్రజలందరికీ మంచినీరు అందుబాటులోకి రావాలని ఒకరు మంచి నీటిని కొని తాగడం , తాహతు లేని వాళ్ళు మురికి నీరే తాగాల్సి రావడం వంటి పరిస్దితి మారాలని బిస్లరీ లాంటి కంపెనీల నుండి వచ్చిన మంచి నీళ్ళు కొనుక్కుని తాగమనే అడ్వర్టైజ్ మెంట్ ని కోట్ల రూపాయలు ఆశ చూపినా తిరస్కరించారని ఒక సెమినార్ లో విన్నాను.